రతనాల సీమ, రైతన్నల సీమని కొన్ని దశాబ్దాలుగా ఫ్యాక్షన్ కోరల్లో బందీ చేసి, కత్తి పట్టితే కానీ, బాంబు చుట్టితే కానీ డొక్కాడలేని దౌర్భాగ్య స్థితికి తెచ్చారు రాజకీయ నాయకులు! కరుకు మనుషులైనా వెన్నలాంటి మనసుగల సీమ వాసులు గత్యతరం లేక ఒక కుటుంబాన్ని, ఒక సామాజిక వర్గాన్ని బానిసలుగా మోస్తూనే ఉన్నారు! నిప్పు కనికల్లాంటి యువతని బెట్టింగులకు, గుండాగిరికి, స్మగ్లింగులకు, వర్గ పోరులకు, నెరస్తులుగా మార్చి తాము పాలకులగా దశాబ్దాలుగా దౌర్జన్యకాండ సాగిస్తూనే ఉన్నారు! ఎవరో ఒకరు రాకపోతారా మా సీమ బ్రతుకులు మారకపోతాయా అని కళ్ళు కాయలు కాచేలా వేచి చూస్తూనే ఉన్నారు! ఈ గుండాగిరి పాలన ఎదిరించలేక, ఇక్కడే ఇమడ లేక ఉద్యోగావకాశాలు లేక కత్తులు బాంబులు పట్టలేక వలసలు పోయిన కుటుంబాలు ఎన్నో... వలస పోతున్న కుటుంబాలు ఇంకెన్నో! ఒకప్పటి రాయలసీమ రతనాలసీమ అంట అని బుర్రకతలు చెప్పుకు తిరిగే పరిస్థితులు! ఇలాంటి నిర్బేద్య పరిస్థితుల్లో ఒక ఆశ చిగురించింది, ఈ నైరాస్య చీకటి ప్రయాణంలో బహుదూరాన ఒక వెలుగు కనిపించింది! ఈ గుక్క చిక్కని అణగారిన బ్రతుకు పరుగులో ఒక పవనం వీచింది! ఒక సామాన్యుడి బెదురు బిక్క బ్రతుకుకి ఒక ధ...