రతనాల సీమ, రైతన్నల సీమని కొన్ని దశాబ్దాలుగా ఫ్యాక్షన్ కోరల్లో బందీ
చేసి, కత్తి పట్టితే కానీ, బాంబు చుట్టితే కానీ డొక్కాడలేని దౌర్భాగ్య
స్థితికి తెచ్చారు రాజకీయ నాయకులు! కరుకు మనుషులైనా వెన్నలాంటి మనసుగల సీమ
వాసులు గత్యతరం లేక ఒక కుటుంబాన్ని, ఒక సామాజిక వర్గాన్ని బానిసలుగా
మోస్తూనే ఉన్నారు!
నిప్పు కనికల్లాంటి యువతని బెట్టింగులకు, గుండాగిరికి,
స్మగ్లింగులకు, వర్గ పోరులకు, నెరస్తులుగా మార్చి తాము పాలకులగా
దశాబ్దాలుగా దౌర్జన్యకాండ సాగిస్తూనే ఉన్నారు! ఎవరో ఒకరు రాకపోతారా మా సీమ
బ్రతుకులు మారకపోతాయా అని కళ్ళు కాయలు కాచేలా వేచి చూస్తూనే ఉన్నారు! ఈ
గుండాగిరి పాలన ఎదిరించలేక, ఇక్కడే ఇమడ లేక ఉద్యోగావకాశాలు లేక కత్తులు బాంబులు పట్టలేక
వలసలు పోయిన కుటుంబాలు ఎన్నో... వలస పోతున్న కుటుంబాలు ఇంకెన్నో! ఒకప్పటి రాయలసీమ
రతనాలసీమ అంట అని బుర్రకతలు చెప్పుకు తిరిగే పరిస్థితులు!
ఇలాంటి నిర్బేద్య
పరిస్థితుల్లో ఒక ఆశ చిగురించింది, ఈ నైరాస్య చీకటి ప్రయాణంలో బహుదూరాన ఒక వెలుగు కనిపించింది! ఈ గుక్క చిక్కని అణగారిన బ్రతుకు పరుగులో
ఒక పవనం వీచింది! ఒక సామాన్యుడి బెదురు బిక్క బ్రతుకుకి ఒక ధైర్యం కలిగింది
! కొన్ని దశాబ్దాలుగా వేచి చూసిన గుండె చప్పుడు ఆ మహాశివుని డమరుకంలా ఒళ్ళు
జలదరించింది! ఈ రాయల సీమ ప్రజల పౌరుష ప్రతిబింబం ఒక నాయకుడిలో కనపడింది!
ఫ్యాక్షనిస్టులను, గుండాలను మోసి సొమ్మసిల్లిన భుజాలు ఒక ప్రజా
నాయకుడిని మోయడానికి వేచి చూస్తున్నాయి! ఈ మొరటు మనుషులు అంత తేలికగా
ఎవ్వరిని నమ్మరు, ఒక్కసారి నమ్మాక ప్రాణాలు పోయినా వాళ్ళని గుండెల్లోంచి
తొలగించరు! సీమ తొలి గడప, కడప సీమ ప్రజల తరుఫున జనసేనానికి స్వాగతం
పలుకుతోంది! రాసుకోండి ! రాబోయే సంవత్సరాల్లో రాయలసీమ జనసేన అడ్డాగా మారడం
తథ్యం! రాయలసీమ ప్రజల గుండెల్లో జనసేనాని శాశ్వతముగా నిలిచిపోవడం ఖాయం ! జై
హింద్
జై జనసేన !
Written By: @naveen2k4
Comments
Post a Comment