"నన్ను చాలామంది శంకిస్తారు ఈ వ్యక్తి నిలబడుతాడా అని..యువత నమ్ముతారు ఆడవాళ్లు నమ్ముతారు, పెద్దలు నమ్మలేదని కాదు..ఈ అబ్బాయి చేయగలడా ఇంత మంచి తనము ఉంటే రాజకీయళ్ళలోకి రాడు అని అంటారు. మరి ఎలా ఉండాలి...దుర్మార్గముగా ఉండాలా? జగన్మోహన్ రెడ్డి లాగ జైలుకు వెళ్ళాలా కేసులు చేసుకొని..అదా రాజకీయం...అప్పుడు నమ్ముతారా నన్ను? చంద్రబాబు గారి లాగా వెళ్లి వెన్నుపోటు పొడిస్తే అప్పుడు నమ్ముతారా నన్ను? అంబేద్కరుగారు చేశారా ఇలాంటి దోపిడీలు? మహాత్మాగాంధీ గారు చేశారా ఇలాంటి దోపిడీలు? మేము చాలా గొప్ప ఆశయాలతో వెళుతున్నాము, చాలా చిత్తశుద్దిగా, త్రికరణశుద్దిగా వున్నస్వాతంత్ర యోధులను స్ఫూర్తిగా తీసుకొని వెళ్లుతున్నాము. రాజకీయం అంటే వెన్నుపోట్లు పొడిచినవాళ్లు, ప్రజాధనాన్నికాజేసి జైళ్లకు వెళ్లిన వాళ్ళు...మన Role Models అయితే..వీళ్ళు యువతకు ఏమని చెపుతారు, వీళ్ళకేమి హక్కు వుంది, వీళ్ళకేమి నైతిక బలము వుంది? మాకు పాఠాలేమో గాంధీగారి పాఠాలు, అంబేద్కరుగారి పాఠాలు, సుభాష్ చంద్రబోస్ పాఠాలా? మీరు చూస్తేనేమో అడ్డగోలు దోపిడీలు, ఇసుక మాఫియాలు, స్కాంలా? అసలు వీళ్లల్లో ఒకరికైనా పాలించే హక్కు ఉందా? మనల్ని నిర్దేశించే హక్కు ...