Skip to main content

రాజకీయాల్లో నైతిక విలువలు

"నన్ను చాలామంది శంకిస్తారు ఈ వ్యక్తి నిలబడుతాడా అని..యువత నమ్ముతారు ఆడవాళ్లు నమ్ముతారు, పెద్దలు నమ్మలేదని కాదు..ఈ అబ్బాయి చేయగలడా ఇంత మంచి తనము ఉంటే రాజకీయళ్ళలోకి రాడు అని అంటారు. మరి ఎలా ఉండాలి...దుర్మార్గముగా ఉండాలా? జగన్మోహన్ రెడ్డి లాగ జైలుకు వెళ్ళాలా కేసులు చేసుకొని..అదా రాజకీయం...అప్పుడు నమ్ముతారా నన్ను? చంద్రబాబు గారి లాగా వెళ్లి వెన్నుపోటు పొడిస్తే అప్పుడు నమ్ముతారా నన్ను? అంబేద్కరుగారు చేశారా ఇలాంటి దోపిడీలు? మహాత్మాగాంధీ గారు చేశారా ఇలాంటి దోపిడీలు? మేము చాలా గొప్ప ఆశయాలతో వెళుతున్నాము, చాలా చిత్తశుద్దిగా, త్రికరణశుద్దిగా వున్నస్వాతంత్ర యోధులను స్ఫూర్తిగా తీసుకొని వెళ్లుతున్నాము. రాజకీయం అంటే వెన్నుపోట్లు పొడిచినవాళ్లు, ప్రజాధనాన్నికాజేసి జైళ్లకు వెళ్లిన వాళ్ళు...మన Role Models అయితే..వీళ్ళు యువతకు ఏమని చెపుతారు, వీళ్ళకేమి హక్కు వుంది, వీళ్ళకేమి నైతిక బలము వుంది?
మాకు పాఠాలేమో గాంధీగారి పాఠాలు, అంబేద్కరుగారి పాఠాలు, సుభాష్ చంద్రబోస్ పాఠాలా? మీరు చూస్తేనేమో  అడ్డగోలు దోపిడీలు, ఇసుక మాఫియాలు, స్కాంలా? అసలు వీళ్లల్లో ఒకరికైనా పాలించే హక్కు ఉందా? మనల్ని నిర్దేశించే హక్కు ఉందా వీళ్ళకి?" - Janasena Party Chief Sri Pawan Kalyan in a Meeting with Weavers at Amalapuram, Andhra Pradesh.

Watch Full Speech at -


Comments

Popular posts from this blog

The Main Reason behind Janasena Formation

జనసేన పుడతానికి కారణం - సమన్యాయం కొన్నిశతాబ్దాలు భారత దేశం నిరంకుశ రాచరికపు పాలనలో...మరి కొన్ని శతాబ్దాలు పరాయి దేశస్థుల పాలనలో బంధించబడి ఉంటే - ఎంతో మంది ప్రాణ త్యాగాలతో స్వాతంత్ర్యము సాదించుకున్నా - ప్రజాస్వామ్యం పేరుతో ఎన్నికలప్పుడు ప్రజలను డబ్బుతో, అసత్య వాగ్దానాలతో మభ్య పెడుతూ అధికారం చేజిక్కించుకొని, సాదించుకున్న ప్రజాస్వామ్యాన్ని అవహేళన చేసే విధముగా, తిరిగి అదే రాచరికాన్ని కుటుంబ పాలన చేసిన ఇప్పటి రాజకీయ వ్యవస్థను చూసి, కలత చెంది - కొన్ని కోట్ల మంది అభిమానులున్నా చేతులు కట్టుకొని చూస్తూ కూర్చోలేకే తన సౌకర్యవంతమైన జీవితాన్ని వదలి ప్రజా సేవకై వచ్చాడు జనసేనాని పవన్ కళ్యాణ్ గారు.  

Conventional Politics

ఇప్పుడున్న రాజకీయ వ్యవస్థకు ప్రజలు ఎంతగా అలవాటు పడిపోయారంటే క్రొత్తగా పవన్ కళ్యాణ్ గారి లాంటి నిజాయితీ గల వ్యక్తులు మార్పు గురించి, "నిస్వార్ధ ప్రజా సేవకు" రాజకీయాలలోకి వచ్చినా సంపాయించోకోవటానికి కాకపోతే రాజకీయాలలోకి ఎందుకు వస్తారు అనేఅంతగా అలవాటు పడిపోయారు. అందుకే పవన్ కళ్యాణ్ గారు "నేను Conventional Politics చెయ్యటానికి రావటంలేదు, అందుకే మనమంతా తొందరగా అర్ధం కాము..."