A Tweet From The Janasainik - HariVishalMudra
మహనీయుల త్యాగాలకి సార్థకత కావాలి! ఎందరో మహానుభావులు తమ ప్రాణాలను ఫణముగా పెట్టి సాధించుకున్న స్వాతంత్ర్యం ఇలా దోపిడీకి గురవడానికా? ఇలా అనగతొక్కబడటానికా? ఇందుకా మన సంపదను దోచుకుంటున్నారని తెల్లవారిని కొట్టింది?
ఇప్పుడు మన దేశస్తులే రాజకీయ నాయకుల ముసుగులో మన సంపదను 70 సంవత్సరాలుగా దోచుకుంటూనే ఉన్నారు! ఇవాళ భారత దేశంలో కనీస అవసరాలైన తిండి, బట్ట, నీరు, విద్య, వైద్యం, ఆరోగ్యం లాంటి వాటిలో ఇంకా కోట్ల మందికి దక్కక పోవడానికి కారణం ఎవరు?! ఇంత పెద్ద ప్రజాస్వామ్య దేశం, కోట్ల మంది ప్రజలు, ఆర్థిక వనరులు ఉండి! కలల ఖనిజాల్లాంటి యువత ఉండి! ఇంత సంపద ఉండి! మనం ఎందుకు అభివ్రుద్ది చెందలేక పోతున్నాం? 1947లో రూపాయి మారకం విలువ డాలరుకు సమానంగా ఉంది! అదే 70ఏళ్ల తర్వాత మారకం 70 రూపాయలకు పెరిగింది!మన చుట్టూ ఉన్న వారు అందరూ అభివ్రుద్ది చెందిపోతే! మనం మాత్రం ఇంకా 70 ఏళ్ల నుండి అభివ్రూద్ది చెందుతూనే ఉన్నాం! ఇన్ని సంవత్సరాలు అవుతున్నా కనీస వసతులైన తాగునీరు అందడం లేదు! వైద్య సదుపాయం లేదు! ప్రభుత్వ స్కూళ్లు వెనుకబడిపోయాయి! పేదరికం పెరుగుతూనే ఉంది!
ఇంకెంత కాలం! ఈ దోపిడీ రాజకీయ వ్యవస్థ , ఈ కుటుంబ వారసత్వ రాజకీయాలు! ఈ కుల ఉచ్చులు, ఈ మత చిచ్చులు! ఇంకెంత కాలం? కోల్పోయింది చాలు 72 సంవత్సరాలుగా కట్టిన పన్నులు ఎటు పోయాయి? ఇంత వరకు నీకు నీళ్లు ఇవ్వలేకపోయారు? ప్రశ్నించు పోరాడు సాధించు!
Comments
Post a Comment