Tyler Durden అంటే Fight Club Movie లో Brad Pitt కాదు, అంతకన్నా గొప్ప యోధుడు "జనసైనికుడు" Twitter Fight Club లో అవినీతిపరులను చీల్చి చెండాడే మగధీరుడు @TylerDurden_100
Tyler Twitter లో Thread వేస్తే దానికి తిరుగుండదు. మచ్చుక్కి -
Pinned Tweet
నాకు కుల గజ్జి లేదు, మత పిచ్చి లేదు, ప్రాంతీయ దురభిమానం లేదు, వర్ణ,లింగ భేదాలు అసలే లేవు. మానవత్వం ఉన్నవాడు నాకు ఆప్తుడు దేశం పట్ల,సమాజం పట్ల భాద్యత ఉన్నవాడు ఆరాధ్యుడు భాషాభిమానం ఉన్న వాడు ఆత్మీయుడు.
YS Jagan - A Failed Opposition Leader
ప్రతిపక్ష నేత,కాబినెట్ ర్యాంకు,దాదాపు ముఖ్యమంత్రి స్థాయి,ప్రభుత్వ
వైఫల్యాల్ని ఎత్తిచూపి,ఎండగట్టి నిలదీసి మరీ పనులు చేయించగల హోదా ప్రతిపక్ష
నాయకుడిది.
మరి అంతటి కీలక భాద్యత ఉన్నాకూడా,ఆ పదవికి న్యాయం చేయడంలో విఫలం అయ్యాడు జగన్.ప్రతీ చర్చలోనూ అనవసర విమర్శలు,వ్యక్తిగత దూషణలు,అహంకార పూరిత వ్యాఖ్యలు,అసహనంతో వాక్ ఔట్లు. ఒకటీ రెండూ తప్పితే అయన ప్రసంగాలన్నీ ఇలానే సాగాయి ఈయన అసెంబ్లీ కి హాజరైన మూడేళ్ళలో YCP చేసిన ఘన కార్యాలు ఇవే.
చర్చల్లో హుందాతనం ఉండదు.
అతి సాధారణ విషయం పై చర్చని కూడా అడ్డగోలు విమర్శలతో పక్కదారి పట్టించి యుద్ధ రంగాన్ని తలపించేలా మార్చేయడం అయన ప్రత్యేకత.
పోడియం దగ్గర గోల చేసే సభ్యులని కనీసం కంట్రోల్ కూడా చేయకుండా గంటలకొద్దీ విలువైన సభా సమయాన్ని వృధా చేయడంలో దిట్ట.
YCP వాళ్ళు పొద్దున్న లేస్తే రాజన్న ఆశయాలు అని అందుకుంటారు.
మరి ఆ Ysr కూడా అసెంబ్లీలో ఆవేశం పనికిరాదు,హుందాగా ఉండాలి,అని చెప్పిన మాటలు వీళ్ళు ఎందుకు పాటించరో తెలియదు.
అసెంబ్లీ నుండి ఎందుకు పారిపోయారు అంటే,మాకు మైక్ ఇవ్వలేదు అంటారు YCP వాళ్ళు.
సంఖ్యా బలాన్ని బట్టి సమయం నిర్ణయిస్తారు,కానీ కొన్ని సార్లు అర్ధవంతమైన
ప్రసంగాలు,చర్చలు చేస్తే ఏక సభ్యుడు ఉన్న పార్టీకి కూడా సుమారు గంటకి పైగా
సమయం కేటాయించిన సందర్భాలు ఉన్నాయి.
జగన్ మాత్రం మాకు మైక్ కట్ చేసారు అని తప్పించుకున్నాడు.
దాదాపు 2017మే నుండి YCP MLA లు అసెంబ్లీకి హాజరు అవ్వడంలేదు,అంటే సుమారు
సంవత్సరన్నర నుండి.వీళ్ళకి నెల జీతం అక్షరాల లక్షా పాతిక వేలు.
పని చేయకుండా జీతం తీసుకుంటున్నారు.భేష్....
ఇక్కడ ట్విస్ట్ ఏమంటే,2016లో MLAల జీతాలు పెంచాలి అని అసెంబ్లీ కోరింది,ఆ
కమిటీలో YCP MLA లు కూడా ఉన్నారు.
జగన్ అసెంబ్లీ లో అర్ధవంతమైన చర్చలో పాల్గొనలేదు,
స్పీకర్ పైనే పలు మార్లు అసహనం వ్యక్తం చేశాడు జగన్,
సభ సజావుగా సాగేందుకు ఇసుమంతైన కకృషి చేయలేదు ప్రతిపక్ష నాయకుడిగా,
ప్రజలు తనకిచ్చిన భాద్యతను విస్మరించి చేతులెత్తేసి పలాయన మంత్రం పటిన్చేసాడు.
సరే ప్రతిపక్ష నాయకుడిగా విఫలం అయ్యాడు,కనీసం ఎంఎల్యే గా ఏమైనా చేసాడా అదీ లేదు.
MLA లాడ్స్ కింద ప్రభుత్వం ఏడాదికి రెండు కోట్లు కేటాయిస్తుంది.
ఆ నిధుల్ని ఎక్కడ ఖర్చు చేసారో,ఏమి అభివృద్ధి చేసాడో ఎవరికీ తెలియదు.
ఎలాగు ఆ వివరాలు బయటకి తెలియవు కాబట్టి లోగుట్టు పెరుమాళ్ళకెరుక.
జగన్ హాజరుకాడు,తన పార్టీసభ్యులని సభకు హాజరుకానివ్వడు
ఫలితంగా సభలో ప్రభుత్వాన్ని నిలదీసే ప్రతిపక్షం లేకుండా పోయింది
ప్రశ్నలు తామే వేసుకొని జవాబులు తామే చెప్పుకొని తమభుజాలు తామేచరుచుకొని
తెదేపా వాళ్ళు తామేదో గొప్పగా చేస్తున్నాం అన్నట్లు సభలో మాట్లాడుతున్నారు
ఆపేవాడు,అడిగేవాడులేడని.
MP గా ఘోర వైఫల్యం చెందాడు.
ప్రతిపక్ష నేతగా దారుణంగా విఫలం అయ్యాడు సభకే హాజరు కాకుండా..
ప్రజా ప్రతినిధిగా ప్రజలు ఇచ్చిన రెండు అవకాశాల్ని
వినియోగించుకోకుండా,ఇవన్నీ కాదు నన్ను CM చేస్తేనే సరి అన్నట్లు ఉన్నది ఆయన
ప్రవర్తన.
Thanks Prakash Garu
ReplyDelete#DecodingPK ane series lo konni threads vesanu,a hashtag tho search chesthe untyai,leda nene DM Chesthanu.Meeku Nacchithe avi kooda post cheyandi.
Thanks for the love sir
Sure Dear, Thank You
DeleteGreat work by TYLER DURDEN
ReplyDelete