The Pinned Tweet of @HariVishalMudra
Why to Support Janasena?
ఇవాళ తెలుగు రాష్ట్రాల్లో ఉన్న రాజకీయ పరిస్థితిని వివరిస్తా.
ఒక ఊరు ఉంది, ఆ ఊరుకి వెళ్లాలంటే ఒకటే రోడ్డు, ఆరోడ్డు మోత్తం గుంటలు, బురద, వెళ్లాలంటే నరకప్రాయం.
ఆ ఊరి జనాలు తప్పక అదే రోడ్డులో వెళ్లేవారు.
ఆ దిక్కుమాలిన రోడ్డుని రాజకీయవ్యవస్థగా పోల్చాను, ప్రజలు కాంక్షించే
అభివ్రుద్దిని ఊరితో పోల్చా.
స్యాతంత్య్రం వచ్చినప్పటి నుండి అదే రోడ్డులో, వేరే
దిక్కులేక, ప్రత్యామ్నాయం లేక అవే రాజకీయపార్టీలను గెలిపిస్తూ
వచ్చాం, అభివ్రుద్ది చేసినా చెయ్యకపోయినా.
ఆ ఊరి జనాల అదృష్టం బావుండి, కొత్త రోడ్డు పడింది. ఇక్కడ కొత్త రోడ్డుని #జనసేన తో పోల్చా.
గుంటలు కాని, బురద కాని, లేని రోడ్డు అది. కొత్త రోడ్డు వేసాక కూడా పాత రోడ్డులో వెళ్తామా, లేక కొత్త రోడ్డులోనా???
కుళ్లు,కుతంత్రాలతో నిండి,వోట్లు సీట్ల కోసం కక్కుర్తి పడే పార్టీలకి
support చేస్తామా, సమాజ అభివ్రుద్ది,సమస్యల పరిష్యారమే ద్యేయంగా పనిచేసే #జనసేన కి support చేస్తామా.
ప్రజల్ని మభ్యపెట్టే రాజకీయమా
ప్రజలకి అవగాహన తెచ్చే రాజకీయమా.
అది మన చేతిలోనే ఉంది.
ఇది డబ్బుతో చేసే రాజకీయం కాదు, కులంతో చేసే రాజకీయం కాదు.
ఆలోచన తోటి, Ideology తో చేసే రాజకీయం.
#రాజకీయం అన్న పదానికి నేడు ఉన్న అర్థాన్ని సమూలంగా మార్చడానికి వచ్చిందే ఈ #జనసేన
ఏ సిధ్ధాంతాలతో అయితే రాజకీయ పార్టీని స్థాపించారో,ఆ పార్టీ మనుగడ ప్రశ్నార్థకం అయినప్పుడు,సిధ్ధాంతాలను వీడుతాయి.
కానీ జనసేన అలా కాదు,ఏ సమయం లో అయినా దాని సిధ్ధాంతాలని మరువదు.
ఒక రాజకీయ పార్టీ యొక్క అంతిమ లక్ష్యం అథికారం కాకూడదు, కేవలం ప్రజా సమస్యల
పరిష్కారమే పరమావదిగా ఉండాలి అనే సిద్దాంతంతో స్థాపించబడ్డ పార్టీ #జనసేన
#జనసేనప్రస్థానం నుండి పోరాటభావాలు ఉన్నపార్టీ.
ఇతర రాజకీయ పార్టీ నేతల్లాగా ఒక మాట చెప్పి దాన్ని మర్చిపోవడం, స్వలాభం కోసం ,అయిన వాళ్ల కోసం పార్టీని ఉపయోగించుకోవడం ,ఇటువంటివి #జనసేన లో కుదరవు.
పదవుల కోసం, పవర్ కోసం, స్వలాభం కోసం పార్టీలు మారే జంపర్స్ ,జోకర్స్ కి #జనసేన లో స్థానం లేదు.
వారసత్వ రాజకీయాలకు జనసేన వ్యతిరేకం.
కేవలం నాయకత్వ లక్షణాలు ఉన్న, ప్రజల పక్షాన పోరాడే వాళ్లకే #జనసేన లో చోటు.
ముఖ్యంగా యువతకు పెద్దపీట.
ఆంధ్రా/తెలంగాణ లో ప్రతిభ కలిగి, సమస్యల మీద అవగాహన ఉన్నయువత కోసం #జనసేనఔత్సాహిక శిబిరాలు పెట్టి, యవతను రాజకీయాల్లోకి తెస్తున్నారు.
యువత అనుకుంటే ఏమైనా సాదించొచ్చు,అందకే మార్పు కోసం యవతకు ప్రాథాన్యత.
గట్టిగా ఎదిరిస్తే అసెంబ్లీలో ప్రతిపక్ష నేతల మైక్ కట్ చేస్తున్న ఈ
రోజుల్లో, సామాన్యుడికి మైక్ ఇచ్చి మీ సమస్యలను చెప్పండి అని సామాన్యుడికి
అందలం ఇచ్చిన పార్టీ #జనసేనపార్టీ.
జనసేన సామాన్యుడి సేన అనడానికి ఇది ఒక నిదర్మనం.
ఆయన డబ్బు కోసమో,పదవి కోసమో రాజకీయాల్లోకి రాలేదు,డబ్బే కావాలనుకుంటే
సం"రానికి 3 సినిమాలు,4 Ads చేసుకుంటే 1yearకి 100 కోట్లు సంపాదించొచ్చు. పదవే
కావాలనుకుంటే 2009 ,2014లో ఎక్కడో చోట పోటీ చేసేవారు, లేక రాజ్యసభకి
వెళ్లేవారు.
లేక MLC అయ్యుండేవారు.
కానీ ఆయనకి పదవికాంక్ష లేదు.
మధ్య, దిగువ మధ్యతరగతి ప్రజల భాథలు ఆయనకి తెల్సు.ఈ రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించడానికే పార్టీ.
ఆయన క్రేజ్ ,అభిమానం ద్వారా సమస్యల్ని పరిష్కరించాలని తపించారు.
అదే విథం గా ముందుకి వెళ్తున్నారు.
కుల, మత రాజకీయాలు కీలకం అయిన ఈ రోజుల్లో, నాకు కులం లేదు, మతం లేదు, ప్రాంతం లేదు అని చెప్పే దైర్యమున్న ఎకైక రాజకీయనాయకుడు #పవన్కళ్యాణ్
ఆయన సమస్యల మీద రాజకీయాలు చేసే #రాజకీయ నాయకుడు కాదు, ప్రజా సమస్యల మీద పోరాటం చేసే ప్రజా నాయకుడు.
సామాన్యులని రాజకీయాల్లోకి తీసుకురావాలని కాంక్షించే వ్యక్తి.
నీ అభిమాన నటుడు పార్టీ పెట్టాడనో, నీకు ఇష్టమైన వ్యక్తి పార్టీ పెట్టాడనో
కాకుండా, పార్టీ ద్వారా నీ గ్రామానికి, నీ నియోజకవర్గానికి ,నీకున్న
సమస్యల్ని పరిష్కరించూకోవాలి, అందుకు నువ్వు #జనసేన కి Support చెయ్యాలి.
సమస్యల పరిష్కారానికి మిగతా పార్టీలు ఉన్నా జనసేనకే ఎందుకు Support
చెయ్యాలి అంటే, మిగతా పార్టీలు సమస్యలు తెలసుకోవడానికే సమయం ఉండట్లేదు, ఇంకేం
పరిష్కరిస్తారు? సమస్యకు పరిష్కారం చూపినా అది లంచం,డబ్బుతో ముడిపడి
ఉంటుంది.
నువ్వు పవన్ కళ్యాణ్ గారి అభిమాని అయితేనే, ఆయన సినిమాలు చూస్తేనే జనసేనకి
support చెయ్యాలని లేదు, సమాజ శ్రేయస్సుకోరే, సమస్యల పరిష్కారం కోరుకునే
వాళ్లందరూ జనసేన సైనికులే.
జనసేనకి Support చెయ్యడానికి కులం, మతం, ప్రాంతం అక్కర్లేదు.
*******************************************************************
జనసేన పార్టీ అంటే అస్సలు అవగాహన లేని వారు కూడా @HariVishalMudra Pinned Tweet చదివితే తప్పకుండ జనసేన సిద్ధాంతాలను అర్ధం చేసుకుంటారు. అంత చక్కగా తన ట్వీట్ ద్వారా "హరి విశాల్" జనసేన గురించి విపులీకరించారు.
Read more such meaningful Tweets at @HariVishalMudra
Comments
Post a Comment