Skip to main content

The Janasainik - Tyler Durden

 

Tyler Durden అంటే Fight Club Movie లో Brad Pitt కాదు, అంతకన్నా గొప్ప యోధుడు "జనసైనికుడు" Twitter Fight Club లో అవినీతిపరులను చీల్చి చెండాడే మగధీరుడు @TylerDurden_100

 

Tyler Twitter లో Thread వేస్తే దానికి తిరుగుండదు. మచ్చుక్కి -

Pinned Tweet 

నాకు కుల గజ్జి లేదు, మత పిచ్చి లేదు, ప్రాంతీయ దురభిమానం లేదు, వర్ణ,లింగ భేదాలు అసలే లేవు. మానవత్వం ఉన్నవాడు నాకు ఆప్తుడు దేశం పట్ల,సమాజం పట్ల భాద్యత ఉన్నవాడు ఆరాధ్యుడు భాషాభిమానం ఉన్న వాడు ఆత్మీయుడు.

YS Jagan - A Failed Opposition Leader

ప్రతిపక్ష నేత,కాబినెట్ ర్యాంకు,దాదాపు ముఖ్యమంత్రి స్థాయి,ప్రభుత్వ వైఫల్యాల్ని ఎత్తిచూపి,ఎండగట్టి నిలదీసి మరీ పనులు చేయించగల హోదా ప్రతిపక్ష నాయకుడిది.  

మరి అంతటి కీలక భాద్యత ఉన్నాకూడా,ఆ పదవికి న్యాయం చేయడంలో విఫలం అయ్యాడు జగన్.ప్రతీ చర్చలోనూ అనవసర విమర్శలు,వ్యక్తిగత దూషణలు,అహంకార పూరిత వ్యాఖ్యలు,అసహనంతో వాక్ ఔట్లు. ఒకటీ రెండూ తప్పితే అయన ప్రసంగాలన్నీ ఇలానే సాగాయి ఈయన అసెంబ్లీ కి హాజరైన మూడేళ్ళలో YCP చేసిన ఘన కార్యాలు ఇవే.

చర్చల్లో హుందాతనం ఉండదు. అతి సాధారణ విషయం పై చర్చని కూడా అడ్డగోలు విమర్శలతో పక్కదారి పట్టించి యుద్ధ రంగాన్ని తలపించేలా మార్చేయడం అయన ప్రత్యేకత. పోడియం దగ్గర గోల చేసే సభ్యులని కనీసం కంట్రోల్ కూడా చేయకుండా గంటలకొద్దీ విలువైన సభా సమయాన్ని వృధా చేయడంలో దిట్ట.
YCP వాళ్ళు పొద్దున్న లేస్తే రాజన్న ఆశయాలు అని అందుకుంటారు. మరి ఆ Ysr కూడా అసెంబ్లీలో ఆవేశం పనికిరాదు,హుందాగా ఉండాలి,అని చెప్పిన మాటలు వీళ్ళు ఎందుకు పాటించరో తెలియదు.
అసెంబ్లీ నుండి ఎందుకు పారిపోయారు అంటే,మాకు మైక్ ఇవ్వలేదు అంటారు YCP వాళ్ళు.
సంఖ్యా బలాన్ని బట్టి సమయం నిర్ణయిస్తారు,కానీ కొన్ని సార్లు అర్ధవంతమైన ప్రసంగాలు,చర్చలు చేస్తే ఏక సభ్యుడు ఉన్న పార్టీకి కూడా సుమారు గంటకి పైగా సమయం కేటాయించిన సందర్భాలు ఉన్నాయి. జగన్ మాత్రం మాకు మైక్ కట్ చేసారు అని తప్పించుకున్నాడు.
దాదాపు 2017మే నుండి YCP MLA లు అసెంబ్లీకి హాజరు అవ్వడంలేదు,అంటే సుమారు సంవత్సరన్నర నుండి.వీళ్ళకి నెల జీతం అక్షరాల లక్షా పాతిక వేలు. పని చేయకుండా జీతం తీసుకుంటున్నారు.భేష్.... ఇక్కడ ట్విస్ట్ ఏమంటే,2016లో MLAల జీతాలు పెంచాలి అని అసెంబ్లీ కోరింది,ఆ కమిటీలో YCP MLA లు కూడా ఉన్నారు.
జగన్ అసెంబ్లీ లో అర్ధవంతమైన చర్చలో పాల్గొనలేదు, స్పీకర్ పైనే పలు మార్లు అసహనం వ్యక్తం చేశాడు జగన్, సభ సజావుగా సాగేందుకు ఇసుమంతైన కకృషి చేయలేదు ప్రతిపక్ష నాయకుడిగా, ప్రజలు తనకిచ్చిన భాద్యతను విస్మరించి చేతులెత్తేసి పలాయన మంత్రం పటిన్చేసాడు.
సరే ప్రతిపక్ష నాయకుడిగా విఫలం అయ్యాడు,కనీసం ఎంఎల్యే గా ఏమైనా చేసాడా అదీ లేదు. MLA లాడ్స్ కింద ప్రభుత్వం ఏడాదికి రెండు కోట్లు కేటాయిస్తుంది. ఆ నిధుల్ని ఎక్కడ ఖర్చు చేసారో,ఏమి అభివృద్ధి చేసాడో ఎవరికీ తెలియదు. ఎలాగు ఆ వివరాలు బయటకి తెలియవు కాబట్టి లోగుట్టు పెరుమాళ్ళకెరుక.
జగన్ హాజరుకాడు,తన పార్టీసభ్యులని సభకు హాజరుకానివ్వడు ఫలితంగా సభలో ప్రభుత్వాన్ని నిలదీసే ప్రతిపక్షం లేకుండా పోయింది ప్రశ్నలు తామే వేసుకొని జవాబులు తామే చెప్పుకొని తమభుజాలు తామేచరుచుకొని తెదేపా వాళ్ళు తామేదో గొప్పగా చేస్తున్నాం అన్నట్లు సభలో మాట్లాడుతున్నారు ఆపేవాడు,అడిగేవాడులేడని.
MP గా ఘోర వైఫల్యం చెందాడు. ప్రతిపక్ష నేతగా దారుణంగా విఫలం అయ్యాడు సభకే హాజరు కాకుండా.. ప్రజా ప్రతినిధిగా ప్రజలు ఇచ్చిన రెండు అవకాశాల్ని వినియోగించుకోకుండా,ఇవన్నీ కాదు నన్ను CM చేస్తేనే సరి అన్నట్లు ఉన్నది ఆయన ప్రవర్తన.

The above is just a sample of many of his Tweet Threads. Read more at @TylerDurden_100

Comments

  1. Thanks Prakash Garu

    #DecodingPK ane series lo konni threads vesanu,a hashtag tho search chesthe untyai,leda nene DM Chesthanu.Meeku Nacchithe avi kooda post cheyandi.

    Thanks for the love sir

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

Wasted Vote Syndrome - నా ఓటు వృధా చేసుకోవాలా???

Why Every Vote Matters ప్రజాస్వామ్యములో ఒక్క వోట్ తేడాతో ఓడిపోయిన సందర్భాలు ఎన్నోవున్నవి. అలాగే గెలిచే పార్టీకే వోట్ వేద్దాం అని అవినీతి పార్టీలను ఎన్నుకొనేవారు కొందమంది అయితే, డబ్బుకో మందుకో ప్రలోభపడి ఓటును అమ్ముకొనేవాళ్ళు ఇంకొందరు. క్రొత్త పార్టీ అయినా జనసేనకు వోట్ వెయ్యడానికి "జనసేన గెలవదేమో, నా ఓటు వృధా చేసుకోవాలా???" అని మీమాంసలో ఉండేవారికి కనువిప్పుగా జనసైనికులు @TylerDurden_100 @estrelladepoder సంయుక్తముగా  ఒక వ్యాసం రాసి YouTube Video ను తయారు చేశారు - Wasted Vote Syndrome - నా ఓటు వృధా చేసుకోవాలా ??? ఈ థియరీ ని అర్ధం చేసుకొనేందుకు ఒక చిన్న కథ చెబుతాను .... వందమంది జనాభా కలిగిన ఒక ఊరు , ఆ ఊరి పక్కనే ఒక పెద్ద చెరువు . ఆ చెరువు కట్టకి గండి పడి నీళ్ళు ఊరి లోపలికి వచ్చేస్తున్నాయి . ఆ గండిని పూడ్చడానికి 30 నుండి 40 మంది కలిసి పనిచేయవలసివుంది . మిగిలినవాళ్లు తమతో కలుస్తారనే ఆశతో పదిమంది గండిని పూడ్చే పని మొదలు పెట్టారు . నేనొక్కడ్ని వెళితేమాత్రం మిగిలిన వాళ్ళు వస్తారా అని ఎనభై ఆగిపోయారు . ఇక మిగిల...

Scams in Andhra Pradesh During TDP Regime

@ HariVishalMudra Exposed the Scams and Bad Governance of TDP Government in the State of Andhra Pradesh, India. మొదటి స్కామ్   రాజధాని పేరుతో ల్యాండ్ పూలింగ్ పేరుతో మూడు పంటలు పండే భూమిని రైతుల నుండి తీసుకుని సింగపూర్ కంపెనీకీ ఇవ్వడానికి జరిగిన కుట్ర! అసలు ఇప్పటి దాకా అక్కడ చేసిందేంటో! రెండోది తాను చేసిన వాగ్దానం ప్రకారం రుణమాఫీ కోసం ప్రపంచ బ్యాంక్ నుండి అప్పు తీసుకుని రాష్ట్ర ప్రభుత్వం అప్పు అమాంతం పెంచేశారు! మన అప్పుల కోసం ప్రభుత్వం ఏటా 6000 కోట్ల వడ్డీలు కడుతుంది! పోని రుణమాఫీ పూర్తిగా జరిగిందా అంటే అదీ లేదు!  విభజన సమయంలో 80000 కోట్లుగా ఉన్న అప్పు 4సం లో 2.25లక్షల కోట్లకి చేరింది! అప్పు దేనికి చేశారు? దేనికి ఖర్చు చేశారు? ఎందుకు చేశారు? దానికి బిల్స్ ఉన్నాయా? లెక్కలు చూపండి CM Sir.     మూడోది పట్టిసీమ పేరుతో దగా! నదుల అనుసంధానం పేరుతో పోలవరం దిగువన పట్టిసీమ అని ఎత్తిపోతల పధకాన్ని ప్రారంభించారు! దాని వ్యయం 1400 కోట్లు అయితే, తన వాళ్లకి ఇంకా ఎక్కువకి అప్పగించింది! మాటర్ ఏంటంటే అక్కడ వాడిన పంపులు వేరే ఎత్తిపోతల పధకానివి ...

The Dedicated Janasainik - Sudarsan Sharma

The Pinned Tweet of @ urssudarsan నేను జనసేన పార్టీకి మద్దతు ఇస్తుంటే అందరూ పవన్ కళ్యాణ్ నీకు ఏంచేశాడు? అని అడుగుతున్నారు... నా సమాధానం, నాకు ఎవరూ ఏమీ చెయ్యనకర్లేదు, నాకు కావలసినవి నేనే చేస్కో గలనూ అనే "దైర్యం" ఆయనని చూస్తుంటేనే వచ్చింది. ఎదుటివారికి సహాయం చెయ్యడంలో "ఆనందం"... ఆయనవల్లే తెలిసింది. @ PawanKalyan  ****************************************************************** "దైర్యం"        =  Courage "ఆనందం"    =  Happiness Public: Why You're Supporting Pawan Kalyan Garu? What did he gave to you? 𝕊udarsan: I don't need anything from anyone, with the Inspiration and Courage given by Pawan Kalyan Sir I can get things done on my own. I learned from him the "Real Happiness" is in Extending Helping Hand to the Needy. Learn More about Sudarsan Sharma at @ urssudarsan